HMDA Notification: ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్ నిపుణులు కావాలి

by Gantepaka Srikanth |

హెచ్ఎండీఏ రవాణా రంగ విభాగమైన హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ (హెచ్-యూఎంటీఏ) కాంట్రాక్టు విధానంలో రెండేండ్ల పాటు పనిచేయడానికి ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్ నిపుణులు కావాలని హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీచేసింది.

HMDA Notification: ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్ నిపుణులు కావాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ రవాణా రంగ విభాగమైన హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ (హెచ్-యూఎంటీఏ) కాంట్రాక్టు విధానంలో రెండేండ్ల పాటు పనిచేయడానికి ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్ నిపుణులు కావాలని హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్ విధానాలను పరిశీలించడానికి, డిజైన్లను స్రూట్నీ చేయడానికి ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్ నిపుణులు అవసరమని హెచ్ఎండీఏ గుర్తించింది. అందులో భాగంగా హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ అథారిటీ (హెచ్-యూఎంటీఏ) ఆధ్వర్యంలో నోటిఫీకేషన్ జారీచేసింది. ఒక జాయింట్ డైరెక్టర్(ట్రాన్స్ పోర్టేషన్), ముగ్గురు ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్లు/ప్లానర్లను కాంట్రాక్టు విధానంలో రెండేండ్లపాటు పనిచేసేవిధంగా నియమించుకోవాలని నిర్ణయించారు.

జాయింట్ డైరెక్టర్, ముగ్గురు ఇంజినీర్లు..

జాయింట్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం, మాస్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టం, మల్టీ మోడల్ సిస్టం వంటి వాటిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలని నోటీఫికేషన్‌లో పేర్కొన్నారు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్, ట్రాన్స్ పోర్టేషన్ ప్లానింగ్‌లో పీజీ చేసి ఉండాలని సూచించింది. పీజీ పూర్తయిన తర్వాత 15 ఏండ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలని సూచించింది. దీంతోపాటు ఇంజినీర్/ప్లానర్‌గా దరఖాస్తు చేసుకునేవారికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌లో ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా బస్ లేన్స్, బస్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టం, మాస్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టం, మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి వాటిలో పనిచేసి ఉండాలని సూచించింది. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ట్రాఫిక్, ట్రాన్స్ పోర్టేషన్ ఇంజినీరింగ్, ట్రాన్స్ పోర్టేషన్ ప్లానింగ్‌లో పీజీ చేసి ఉండాలని సూచించింది. పీజీ పూర్తయిన తర్వాత మూడేండ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలని సూచించింది.

విధానాల రూపకల్పన, అమలు..

హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో హెచ్ఎండీఏ కీలకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్ విధానాన్ని రూపొందించడంతో పాటు అమలు చేయడంలోనూ హెచ్ఎండీఏ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న స్పల్పకాలిక ప్రణాళికల్లో భాగంగా జంక్షన్ల అభివృద్ధి, మాధ్యమిక ప్రణాళికల్లో భాగంగా కారిడార్ల నిర్మాణం, అభివృద్ధి, దీర్గకాలిక ప్రణాళికల్లో భాగంగా ఫ్లైఓవర్లను నిర్మించడం, కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్(సీఎంపీ), ట్రాన్సిస్ట్ ఓరియింటెండ్ డెవలప్‌మెంట్(టీఓడీ) వంటి ప్రాజెక్టులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సూచించిన ప్రాజెక్టులకు డిజైన్ తయారు చేయించడం, వాటిని స్రూట్నీ కూడా చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Next Story