- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HMDA Commissioner: సర్కార్ రాయితీని సద్వినియోగం చేసుకోండి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. బీఆర్కే భవన్‌లో బుధవారం ఎల్ఆర్ఎస్-2020 గురించి లైసెన్డ్స్ టెక్నికల్ పర్సన్స్(ఎల్టీపీ), ఆర్కిటెక్ట్ లకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 160 మంది ఎల్టీపీలు, ఆర్కిటెక్ట్ లు, ప్లానింగ్ డైరెక్టర్, ప్లానింగ్ అధికారులు హాజరయ్యారు. ఈ వర్క్ షాపులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం గురించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) ప్రతినిధులు సమగ్రంగా వివరించారు. ఈ సందర్బంగా కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీచేసిన జీఓ నెం.28లోని నిబంధనలను వివరించారు. ఫీజు చెల్లిస్తే 10 రోజుల్లోనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్-2020 నిబంధనల ప్రకారం 28ఆగస్టు2020కు ముందు అనుమతిలేని లేఅవుట్లలో 10శాతం ప్లాట్లు అమ్ముడుపోయినా మిగిలిన 90శాతం ప్లాట్లకు సైతం ఎల్ఆర్ఎస్ చేయనున్నట్టు ప్రకటించారు.
నీటివనరులు, చెరువులకు 200మీటర్ల సమీపంలో ఆ దరఖాస్తులను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రాసెస్ చేయనున్నట్టు తెలిపారు. నిషేధిత భూములు, ప్రభుత్వ భూములు, నీటివనరులు, నీటివనరులు, చెరువులకు 200మీటర్ల సమీపంలోలేని దరఖాస్తులకు ఆటోమెటిక్ గా నోటీసులు జారీచేయనున్నట్టు హెచ్ఎండీఏ కమిషనర్ పేర్కొన్నారు. ఈనెల 31లోగా ఫీజు చెల్లిస్తే ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీ కూడా వర్తస్తోందని తెలిపారు. ఒకవేళ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు తిరస్కరించబడితే 10శాతం ఫీజు కట్ చేపుకుని 90శాతం ఫీజు చెల్లించడుతుందని చెప్పారు. ఒకవేళ ఓపెస్ స్పేస్ చార్జీలు బల్డింగ్ పర్మిషన్ సమయంలో చెల్లించాలనుకునేవారికి ప్రభుత్వం నిర్ణయించిన 25శాతం రాయితీ వర్తించదని వివరించారు. హెచ్ఎండీఏ ఏర్పాటు కాల్ సెంటర్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పనిచేస్తోందని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.






