నేపాల్‌ గడ్డపై వెల్లువిరిసిన తెలుగు కవితా పరిమళం

by Naga Rani Yarlagadda |

తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి హిమాలయాల చెంత నేపాల్ లో అరుదైన రీతిలో తెలుగు కవి సమ్మేళనం అట్టహాసంగా జరిగింది.

నేపాల్‌ గడ్డపై వెల్లువిరిసిన తెలుగు కవితా పరిమళం
X
  • ఖాట్మండులో ఘనంగా ఇండో-నేపాల్ కవి సమ్మేళనం
  • సందడి చేసిన 135 మంది తెలుగు యాత్రికులు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి హిమాలయాల చెంత నేపాల్ లో అరుదైన రీతిలో తెలుగు కవి సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఇండో- నేపాల్ కవి సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇరవై మంది కి పైగా ప్రఖ్యాత కవులు కవితా గానంతో అలరించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి జీవీ శ్యాం ప్రసాద్ లాల్ తన మిత్ర బృందంతో కలిసి చేపట్టిన నేపాల్ యాత్రలో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని తలపెట్టారు. నేపాల్ రాజధాని ఖాట్మండులోని క్రిస్టల్ పశుపతి హోటల్ ఈ చారిత్రక సమ్మేళనానికి వేదికైంది. సుమారు 135 మంది తెలుగు యాత్రికులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఎస్ రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జీవీ శ్యాం ప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ కవిసమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం విశ్వజనీనమైనదని కొనియాడారు. యాత్రల వల్ల సాహిత్యకారులకు ప్రపంచ జ్ఞానం విస్తృతమవుతుందని, ఇలాంటి వేదికలు భాషా సంస్కృతుల బంధాన్ని బలపరుస్తాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కవి సమ్మేళనం లో బూర్ల వెంకటేశ్వర్లు గాజుల రవీందర్ నాంపల్లి సుజాత, మాడిశెట్టి గోపాల్ రావికంటి శ్రీనివాస్, స్థంబంకాడి గంగాధర్, సివి శ్రీనివాస్, డాక్టర్ కూరెళ్ళ పద్మాచారి, కృష్ణ గోపాల్ ముత్తినేని శ్రీనివాసరావు, డాక్టర్ దాసోజు జ్ఞానేశ్వర్ సంపత్ అశోక్, జ్యోతి, గోనె శ్రీనివాస్, ప్రేమలత తదితరులు పాల్గొని యాత్రల మీద మంచి కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ దేవ్, నల్లవెంకటేశ్వర్లు తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.

Next Story