125 ఏండ్ల హిస్టరీ బిల్డింగ్ లో.. మరోసారి పోలీసు ఠాణా సేవలు ప్రారంభం...

by Bhanu |   (  Updated:2025-06-03 14:33:05  IST  )

శతాబ్దానికి పైగా పోలీసు సేవలను అందించిన రాంగోపాల్ పేట్ పోలీసు స్టేషన్ భవనం ముస్తాబు చేసుకుని 9 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి ప్రారంభం కానుందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, డీజీ సీవీ ఆనంద్ తెలిపారు.

125 ఏండ్ల హిస్టరీ బిల్డింగ్ లో.. మరోసారి పోలీసు ఠాణా సేవలు ప్రారంభం...
X

దిశ, సిటీక్రైం : శతాబ్దానికి పైగా పోలీసు సేవలను అందించిన రాంగోపాల్ పేట్ పోలీసు స్టేషన్ భవనం ముస్తాబు చేసుకుని 9 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి ప్రారంభం కానుందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, డీజీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ లోని రామ్ గోపాల్ పేట్ పోలీసు స్టేషన్ భవనాన్ని సందర్శించారు. 1900 సంవత్సరం నుంచి జేమ్స్ స్ట్రీట్ లోని చారిత్రక చరిత్ర ఉన్న ఈ భవనంలో పోలీసు సేవలను ప్రారంభించి 2016 సంవత్సరం వరకు ఇందులోనే రాంగోపాల్ పేట్ పోలీసు స్టేషన్ ను నిర్వహించారు. భవనం పురాతనం కావడంతో 2016 లో మరమ్మత్తుల కోసం భవనాన్ని హెచ్ఎమ్ డిఏ కు అప్పగించారు.

మరమ్మత్తులను పూర్తి చేసి భవనాన్న తిరిగి పోలీసులకు అప్పగించారు. దీంతో ఈ భవనాన్ని సందర్శించిన సీపీ ఆనంద్ త్వరలోనే ప్రస్తుతం మినిస్టర్ రోడ్డు లో ఉన్న పోలీసు స్టేషన్ ను ఇక్కడికి బదిలీ చేసే పనులను ప్రారంభించాలని సీపీ అధికారులకు తెలిపారు. అయితే ఈ పోలీసు స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, పోలీసు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసేందుకు పోలీసులు చర్యలను ప్రారంభించారు. భావితరాల కోసం చారిత్రక భవనాలను కాపాడుకోవాలని సీపీ పేర్కొన్నారు. సీపీ వెంట నార్త్ జోన్ డీసీపీ రష్మిక పెరామాళ్ , ట్రాఫిక్ డీసీపీ రాహూల్ హెగ్డే, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


historic-rgpet-police-station-reopens-after-9-years

Tags: Hyderabad police, Ramgopalpet police station, CV Anand, historic buildings, Hyderabad heritage, police services, Secunderabad news, James Street, Telangana police, GHMC development

Next Story