- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay : తెలంగాణలో హిందువులది బిచ్చపు బతుకైంది : బండి సంజయ్
తెలంగాణలో హిందువులది బిచ్చపు బతుకైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో హిందువులది బిచ్చపు బతుకైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా?.. వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? అని ప్రశ్నించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మంచిర్యాల నియోజకవర్గం ఆత్మీయ సమ్మెళనంలో బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు రంజాన్ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇళ్లకు వెళ్ళవచ్చని ప్రత్యేక వెసులుబాటు ఇచ్చిందని..అదే అయ్యప్ప మాల, శివ మాల, ఆంజనేయ స్వామి, భవానీ మాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదని? బండి సంజయ్ ప్రశ్నించారు.
అయ్యప్ప దీక్షా పరులైన ఉద్యోగులు సొంతంగా వంట చేసుకుని తినాలని..వారు అందుకోసం బయటకు వెళితే ఎక్కడ ఉద్యోగాల్లో పై అధికారులు చర్యలు తీసుకుంటారేమోనన్న భయంతో పస్తులుంటున్నారని..వారికి కూడా ముస్లింలకు ఇచ్చినట్లుగా ఎందుకు వెసులుబాటు ఇవ్వరని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో చట్టం అందరికీ సమానం కాదా? ఒక వర్గం వారికి మాత్రం ఉపశమనాలు, మినహాయింపులు ఇవ్వడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు. అందరినీ సమదృష్టితో చూడాల్సిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వర్గమంటే ఎందుకు పక్షపాతం? ఒక మతంపై ఎందుకీ వివక్ష?..ఒక మతంపై ఎందుకింత కక్ష? అని విమర్శించారు.
ఈ వివక్షతపై ప్రశ్నిస్తే మమ్మల్ని మతతత్వ వాదులంటారన్నారు. తబ్లిక్ జమైతే ఇస్లాం ఉగ్రవాద ప్రేరేపిత సంస్థకు వికారాబాద్ లో సమావేశం పెట్టుకుంటే ఈ ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయాలు ఇచ్చారని..దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెబుతారన్నారు. సూడో సెక్యులరీజం..మైనార్టీ సంతుష్టీకరణ..ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ హిందువులకే కాదు..దేశానికి కూడా ప్రమాదకరంగా మారిందని..ఇప్పుడు కులాల పేరుతో రాజకీయానికి తెరలేపిందని విమర్శించారు.






