ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో భారీ మోసం.. తెలంగాణవాసులకు కుచ్చుటోపీ

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-05-13 09:40:52  IST  )

లంక బిందెల ఆశచూపిన కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో వెలుగు చూసింది.

ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో భారీ మోసం.. తెలంగాణవాసులకు కుచ్చుటోపీ
X

లంక బిందెల ఆశచూపిన కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో వెలుగు చూసింది. ఏపీలోని హిందూపురం ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానికంగా పిట్టలు పట్టి విక్రయిస్తూ కొంతకాలం ఉన్నారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్లిన వారు 15 రోజుల కిందట అక్కడి నుంచి తమకు కొత్తగా పరిచయమైన వారికి ఫోన్ చేసి తమకు లంకె బిందెలు దొరికాయని, వాటిని ఎక్కడ అమ్మాలో తెలియడం లేదంటూ వీడియో చూపారు. డబ్బులు తీసుకుని వస్తే బంగారం ఇస్తామని, హిందూపురానికి రప్పించుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ లింక్‌లో చూడండి.

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్​అధికారులు ఇవాళ ఉదయం మైసూరులో అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు అరెస్టు అయ్యారు. అతనిని మైసూరు నుంచి విజయవాడకు తరలించే అవకాశం ఉంది. బాలాజీ భారతి సిమెంట్స్​లో డైరెక్టర్​గా పనిచేశారు. ఈ కేసులో ఉన్న నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయాల్సిందే.

ఆపరేషన్ సిందూర్‌పై నిన్న రాత్రి కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేడు పాకిస్తాన్ బార్డర్ ప్రాంతంలో పర్యటించారు. ఉదయం పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి భారత వైమానిక దళం సిబ్బందితో ముచ్చటించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను వారితో పంచుకున్నారు. వీర జవాన్లతో మాట్లాడి వారిలో మనోధైర్యం పెంచారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద సైనిక వైమానిక స్థావరం అయిన ఆదంపూర్ బెస్ పాక్ బార్డర్‌కు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా ఉన్న ఎస్-400 వ్యవస్థ ఈ ప్రదేశంలోనే ఉంది. ఇంతకూ మోడీ అక్కడి ఎందుకు వెళ్లారు? దాని వెనక వ్యూహం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story