Hindi Vs South: తెలుగు వస్తేనే ఇళ్లు అద్దెకు ఇవ్వాలి.. నెటిజన్ కామెంట్ వైరల్

by Prasad Jukanti |

హిందీ వర్సెస్ సౌత్ స్టెట్స్ వివాదం నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఆసక్తిగా మారింది.

Hindi Vs South: తెలుగు వస్తేనే ఇళ్లు అద్దెకు ఇవ్వాలి.. నెటిజన్ కామెంట్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంత కాలంగా సౌత్ స్టేట్స్ వర్సెస్ హిందీ (Hindi) మధ్య రగడ జరుగుతోంది. హిందీ పేరు చెబితేనే తమిళనాడు, కర్ణాటక భగ్గుమంటున్నాయి. తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారంటూ ఆందోళనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ అంశంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా కర్నాటకలోని ఓ పోస్ట్ ఆఫీస్ (Karnataka Post Office) సిబ్బంది అంతా హిందీ మాట్లాడేవారే ఉండటం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది. దీనిపై స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కర్నాటకలో ఉన్న పోస్టు ఆఫీస్ లో కన్నడలో సర్వీస్ అందించకపోవడం ఇదేం పద్దతంటూ సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగారు. కన్నడలో (Kannada) సేవలు అందించాలని హిందీలో కాదని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ @SSsagarHyd అనే యూజర్ ఉత్తరాది నుంచి వచ్చే వారితో కమన్యూనికేట్ చేయడానికి దక్షిణ భారతీయులు హిందీ నేర్చుకోవాలి కానీ, నార్త్ ఇండియా నుంచి వచ్చి సౌత్ ఇండియాలో ఉంటూ వారు మాత్రం స్థానిక భాష నేర్చుకోరు ఇది లోపభూయిష్ట విధానం అని విమర్శించాడు. ఈ పోస్టుపై స్పందించిన @ManasaBrs అనే నెటిజన్ రియాక్ట్ అవుతూ.. నార్త్ నుంచి బతుకుదెరువు కోసం సౌత్ కు వచ్చేవాళ్లు ఈ రూల్ పాటించాలి. మన హైదరాబాద్ లో చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ల కారణంగానే హైదరాబాద్ లో అద్దెలు పెరిగాయి. తెలుగు (Telugu) వస్తేనే వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వాలి. అంటూ కామెంట్ చేశారు.

Next Story