Himanshu : తాత కేసీఆర్ తో పొలం పనుల్లో హిమాన్షు..వీడియో వైరల్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-19 11:32:12  IST  )

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) మనవడు(Grandson)..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR Son) కొడుకు కల్వకుంట్ల హిమాన్షు(Kalvakuntla Himanshu)తన తాత(Grandfather)తో పొలం పను(Farm work)ల్లో నిర్వహిస్తున్న వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు.

Himanshu : తాత కేసీఆర్ తో పొలం పనుల్లో హిమాన్షు..వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) మనవడు(Grandson)..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR Son) కొడుకు కల్వకుంట్ల హిమాన్షు(Kalvakuntla Himanshu)తన తాత(Grandfather)తో పొలం పను(Farm work)ల్లో నిర్వహిస్తున్న వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు. ఉత్తమమైన వాటి నుండి నేర్చుకోవాలని..వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అటవీ పెంపకం చాలా అవసరమని..మన సహజ వనరులను రక్షించడం.. సంరక్షించడం మన బాధ్యత అని ట్వీట్ లో పేర్కొన్నారు.

తన తాత కేసీఆర్ తో కలిసి ఆయన వ్యవసాయ క్షేత్రంలో హిమాన్షు మొక్కలను నాటారు. మొక్కలను నాటేందుకు స్వయంగా పార చేత పట్టి గుంతను తవ్విన హిమాన్షు..పక్కన ఉన్న తాత కేసీఆర్ ఎలా చేయాలో చెబుతుండగా.. ఎరువును వేసి మొక్కను నాటాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వీడియోలో హిమాన్షు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ప్రణామం..ప్రణామం..సమస్త ప్రకృతికి ప్రణామం అన్న సినిమా పాటను వినిపించారు. ఇటీవల హిమాన్షు తన తండ్రి కేటీఆర్ పట్ల తన ప్రేమను చాటుకుంటూ ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. స్వదేశానికి వచ్చిన క్రమంలో తాత ఫామ్ హౌజ్ లో పొలం పనుల్లో అనుభవం గడించే పనుల్లో ఉన్నారు.


Click Here For Tweet..

Next Story