- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిల్ట్ పాలసీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు.. 29వ తేదీకి విచారణ వాయిదా
ప్రభుత్వం తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ (హిల్ట్) పాలసీ జీవో నిబంధనలకు విరుద్ధం అని హైకోర్టులో ఇద్దరు పిటిషనర్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ (హిల్ట్) పాలసీ జీవో నిబంధనలకు విరుద్ధం అని హైకోర్టులో ఇద్దరు పిటిషనర్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, పర్యావరణవేత్త, ప్రోఫెసర్ పురుషోత్తం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టు జస్టీస్ సుజయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేఏ పాల్ నవంబర్ 28వ తేదీన పిల్ దాఖలు చేయగా శుక్రవారం విచారణకు వచ్చింది. హిల్ట్ విధానం కింద చేపట్టిన అన్ని ప్రక్రియలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత శాఖకు ఆదేశించాలని పిటిషన్‌లో కేఏపాల్ పేర్కోన్నారు.
హిల్ట్ పాలసీలో 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని, ఈ భూకేటాయింపు అంశంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హిల్ట్ పాలసీలో పేర్కొన్న భూములకు సంబంధించిన అన్ని ఫైళ్లు, క్యాబినెట్ నోట్స్, డిపార్ట్‌మెంటల్ కరస్పాండెన్స్, వాల్యుయేషన్ రిపోర్ట్‌లు, ధరణి ఎంట్రీలు, లీజు డీడ్‌లు బదిలీ ప్రతిపాదనలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కోరారు. మరో పిటిషనర్ పర్యావరణ వేత్త ప్రోఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన హిల్ట్ పాలసీలో వాణిజ్య అభివృద్ధి పేర్కోన్నారు. రెండు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.






