‘పెద్ది’ మూవీ టికెట్‌ ధరల పెంపు.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-10 11:16:38  IST  )

తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్‌పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది.

‘పెద్ది’ మూవీ టికెట్‌ ధరల పెంపు.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన ‘పెద్ది’ (Peddi) సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ హోంశాఖ జారీ చేసిన మెమోపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఈ నెల 2న హోంశాఖ మెమో జారీ చేసిందని దాఖలైన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్‌పై దాఖలైన ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. హోంశాఖ ఇచ్చిన సదరు మెమో అక్రమమని స్పష్టం చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపుదల విషయంలో గతంలో ఉన్న జీవో 121 (GO 121) నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించింది. కేసులో తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు తెలిపింది.

Next Story