TG Govt: రైతుభరోసా పథకంలోని ముఖ్యాంశాలు

by Gantepaka Srikanth |

రైతుభరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ఎకరానికి రూ.12వేలు రైతులకు పెట్టుబడి సాయం అందిచనుంది.

TG Govt: రైతుభరోసా పథకంలోని ముఖ్యాంశాలు
X

దిశ, హైదరాబాద్: రైతుభరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ఎకరానికి రూ.12వేలు రైతులకు పెట్టుబడి సాయం అందిచనుంది. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే సాయం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఏపీసీ, ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్​రావు తెలిపారు. ఆదివారం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు పంపిణీ చేయనుంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం ఖాతాలో జమ కానుంది. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కరం బాధ్యత కల్లెక్టర్లు అప్పగించారు. రేవంత్​రెడ్డి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచనుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పిస్తుంది. ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి, ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

రైతుభరోసా పథకంలోని ముఖ్యాంశాలు :

= రైతుభరోసా కింద సంవత్సరానికి ఎకరాకు రూ.12వేల పెట్టుబడి సాయం

= భూభారతి పోర్టల్‌లో నమోదైన పట్టాదారులకు రైతుభరోసా సహాయం

= ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూముల తొలగింపు

= ROFR పట్టాదారులు కూడా రైతుభరోసా

= RBI నిర్వహించే DBT పద్ధతిలో రైతుల ఖాతాలో జమ

= నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న వ్యవసాయశాఖ సంచాలకులు

= జాతీయ సమాచారం కేంద్రం, ఐటీ భాగస్వామిగా బాధ్యతలు

= ఫిర్యాదుల పరిష్కరణ బాధ్యులుగా కలెక్టర్లు

Next Story