- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్బీలో 16 మంది సీఐల నియామకం
by Javid Pasha |
హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో 16 మంది ఇన్స్పెక్టర్లను నియమిస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో 16 మంది ఇన్స్పెక్టర్లను నియమిస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో స్పెషల్ బ్రాంచ్ పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయా రాజకీయ పార్టీల కార్యకలాపాలపై కన్నేయటంతోపాటు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు? ఏవైనా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయా? అన్నదాంతో పాటు వేర్వేరు రకాల సమాచారాన్ని స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సేకరించి లా అండ్ ఆర్డర్ పోలీసులకు అందచేస్తారు. ఈ సమాచారం ఆధారంగానే లా అండ్ ఆర్డర్ పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే స్పెషల్ బ్రాంచ్ విభాగాన్ని పటిష్టం చేయటానికి ౧౬ మంది ఇన్స్పెక్టర్లను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
Next Story






