కొత్త డిగ్రీ కోర్సులపై ఉన్నత విద్యామండలి అవగాహన కార్యక్రమం

by Ajay Maddhiboyina |

2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న కొత్త డిగ్రీ కోర్సులపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ అవగాహన కార్యక్రమం జరిగింది.

కొత్త డిగ్రీ కోర్సులపై ఉన్నత విద్యామండలి అవగాహన కార్యక్రమం
X

దిశ, తెలంగాణ బ్యూరో : 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న కొత్త డిగ్రీ కోర్సులపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్, టీజీఎస్ డబ్ల్యూ ఆర్ఈఐఎస్, మరియు టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థలకు చెందిన 500 మందికి పైగా ప్రిన్సిపాళ్లు మరియు డిగ్రీ లెక్చరర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ కొత్త కోర్సులు విద్యార్థుల ఉపాధి అవకాశాలు మరియు సామాజిక ప్రాముఖ్యతను పెంపొందించేలా రూపొందించారని, ఆరు విశ్వవిద్యాలయాల వైస్-చాన్స్‌లర్లు, పరిశ్రమ నిపుణులు మరియు ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్లుగా ఆయన పేర్కొన్నారు.

కాలేజీలకు పాఠ్యపుస్తకాలు, నిపుణుల సేవలు, ఇంటర్న్‌షిప్‌ల కోసం కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు జాబితా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కోర్సుల నిర్మాణంలో టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్షిప్, న్యాయ అంశాలు, పరిశోధన/ఇంటర్న్‌షిప్ అనే నాలుగు ముఖ్య భాగాలను సమన్వయం చేసినట్లుగా ఆయన వివరించారు. మారిటైం రంగం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, విద్యార్థులను ఆ దిశగా సిద్ధం చేయడం ఉపాధ్యాయుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కోర్సులను అమలు చేసే సంస్థలకు మండలి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని బాలకృష్టారెడ్డి హామీ ఇచ్చారు. సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story