- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొర్రూరులో హై టెన్షన్ వాతావరణం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర ఆరోపణలు
తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: తొర్రూరు (Thorrur) మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు అంగీకరిస్తే లాటరీ పద్ధతిలో చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డుల్లో గెలుపొందింది. అయితే, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేయించుకోవడంతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. చైర్మన్ ఎన్నికకు ఇరు పార్టీల సంఖ్య సమంగా ఉండటంతో లాటరీ పద్ధతిని చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.
అయితే, ఓటింగ్ వేళ మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి (Errabelli Dayakar Rao) ప్రయత్నించగా ఆయనను పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఓ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు ఎర్రబెల్లి పీఏపై దాడి చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఝాన్సీరెడ్డి (Jhansi Reddy)ని లోనికి అనుమతించి.. తనను పంపకపోవడం ఏంటని ప్రశ్నించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీకి మీటింగ్‌లో కూర్చునే అర్హత ఎక్కడిదని అన్నారు. చైర్మన్ ఎన్నిక వేళ తాను పార్టీ సభ్యులకు విప్ జారీ చేయాల్సి ఉందన్నారు. అందుకు సంబంధించిన పత్రాలను ఆర్డీవోకు ఇవ్వడానికి తాను అక్కడికి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై అకారణంగా దౌర్జన్యం చేశారని ఎర్రబెల్లి సంచలన ఆరోపణలు చేశారు.






