- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ బియ్యానికి దేశంలో హై డిమాండ్ : ఎంపీ డి.కె.అరుణ
రాష్ట్రంలో భారత ఆహార సంస్ధ ద్వారా సేకరించిన బియ్యం 8 రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నామని, దేశ వ్యాప్తంగా తెలంగాణ బియ్యనికి చాలా డిమాండ్ ఉన్నదని FCI కన్సల్టెటివ్ కమిటీ చైర్ పర్సన్ ఎంపీ. డి. కె. అరుణ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భారత ఆహార సంస్ధ ద్వారా సేకరించిన బియ్యం 8 రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నామని, దేశ వ్యాప్తంగా తెలంగాణ బియ్యనికి చాలా డిమాండ్ ఉన్నదని FCI కన్సల్టెటివ్ కమిటీ చైర్ పర్సన్ ఎంపీ. డి. కె. అరుణ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ కన్సల్టెటివ్కమిటీ తొలి సమావేశం హకా భవన్లో నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఎఫీసీఐ పనితీరు,గోడౌన్ల నిర్వహణ, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై సమావేశంలో అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. ఏటేటా రాష్ట్రంలో భారీగా ధాన్యం సేకరణ పెరుగుతోందని, మన బియ్యానికి మార్కెట్లో కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతారని తెలిపారు.
తెలంగాణలో ప్రధానంగా గోడౌన్ ల సమస్య ఉందని, ధాన్యం సేకరణ పెరుగుతున్న నేపథ్యంలో ధాన్యం నిల్వల కోసం గోదాములు అవసరం చాలా ఉందన్నారు. గతం కంటే మద్దతు ధర పెరగడంతో రైతులు పెద్ద ఎత్తున ఎఫ్సీఐకి ధాన్యాన్ని అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను రాష్ట్రాలకే అప్పజెప్పింది. ధాన్యం సేకరణ కోసం అవసరమైన పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ధాన్యం నిల్వల కోసం అవసరమైన చోట గోదాముల నిర్మాణం కోసం ప్రత్తిపాదనలు సిద్ధం చేస్తున్నారని వివరించారు.
శక్తి వంచన లేకుండా తెలంగాణాలో భారత ఆహార సంస్థ అభివృద్ధికి సాయం శక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎఫ్సీఐ ద్వారా రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తానని చెప్పారు. ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణ కన్సల్టెటివ్ కమిటీ ఛైర్మెన్ గా బాధ్యతలు అప్పగించిన కేంద్రం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
- Tags
- MP DK Aruna






