- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కౌశిక్ రెడ్డి పిటిషన్ పై హైకోర్ట్ కీలక నిర్ణయం
ఎన్నికల ప్రచారంలో తన పై నమోదైన కేసు కొట్టివేయాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ప్రచారంలో తన పై నమోదైన కేసు కొట్టివేయాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో కేసు ప్రస్తుంతం విచారణలో ఉంది. ఈ కేసును కొట్టి వేయాలంటూ కౌశిక్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, మార్చి 12కి తదుపరి విచారణను వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజూరాబాద్‌లో ప్రచారం సందర్భంగా కౌశిక్ రెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యాలపై కమలాపూర్ నోడల్ అధికారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రచారంలో తనను గెలిపించక పోతే కుటుంబంతో సహ ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నోడల్ అధికారి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.






