- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారెడ్డి జిల్లా టీచర్లకు షాక్.. ప్రమోషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే..!
రంగారెడ్డి జిల్లాలో టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రమోషన్లపై శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రమోషన్లపై శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సీనియారిటీ జాబితాపై ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 317 ద్వారా జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించారని పిటిషనర్లు వాదించారు. రంగారెడ్డి జిల్లా క్యాడర్ కన్నా ఎక్కువ టీచర్లను కేటాయించారని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో అభ్యంతరాలను పరిశీలించాకే తుది సీనియారిటీ జాబితా రూపొందిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఈ నెల 19 వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్‌ఈ, రంగారెడ్డి డీఈఓకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ప్రాథమిక సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది.






