High Court : తెలంగాణ సర్కార్ కు హైకోర్ట్ షాక్... 24 గంటల పాటు అన్ని పనులు నిలిపి వేయండి

by Muthe.Rajitha |

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Dispute)లో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్(High Court) షాక్ ఇచ్చింది.

High Court : తెలంగాణ సర్కార్ కు హైకోర్ట్ షాక్... 24 గంటల పాటు అన్ని పనులు నిలిపి వేయండి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Dispute)లో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్(High Court) షాక్ ఇచ్చింది. రేపటి వరకు హెచ్సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిలో చెట్లు కొట్టివేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్న ఈ భూమి వివాదంపై వాటా ఫౌండేషన్(Vata Foundation) హైకోర్టులో పిల్(PIL) దాఖలు చేసింది. ఈ భూమిలో ప్రభుత్వ వేలాన్ని నిలిపివేయాలని, వన్యప్రాణులకు ఆవాసమైన ఆ స్థలాన్ని జాతీయ పార్కుగా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. ఈ పిల్ పై బుధవారం హైకోర్ట్ విచారణ చేపట్టింది.

తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) సుప్రీంకోర్టు(Suprem Court) ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ బుల్డోజర్లను ఉపయోగించి చెట్లను నరికివేస్తోందని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూమిని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని అన్నారు. ప్రభుత్వం ఆ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం చెట్లు కొట్టివేసి, ఆ స్థలంలో ఉన్న ఎన్నో వన్యప్రాణుల ప్రాణాలను రిస్క్ లో పెట్టిందన్నారు. ఇరువైపులా వాదనల అనంతరం కంచ గచ్చిబౌలిలో భూమిలో 24 గంటల పాటు ఎలాంటి పనులు చేపట్టరాదని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ.. విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్ట్.

Next Story