హిమాయత్ సాగర్-ఉస్మాన్ సాగర్ కాలుష్యంపై హైకోర్టు సీరియస్.. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

by Ramesh Naini |

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల కాలుష్యం, పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

హిమాయత్ సాగర్-ఉస్మాన్ సాగర్ కాలుష్యంపై హైకోర్టు సీరియస్.. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల కాలుష్యం, పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ జలాశయాల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జలాశయాల్లో మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరి.. నీళ్లు కలుషితమవుతున్నాయంటూ పత్రికలలో వచ్చిన కథనాలు స్పందించి సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

తాగునీటి జలాశయాల్లో వ్యర్థాలు చేరడంపై ఉన్నత న్యాయస్థానం జలమండలిని ప్రశ్నించింది. జలమండలి, కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీని ప్రతివాదులుగా చేర్చింది. జంట జలాశయాల నిర్వహణపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గతంలో దాఖలైన పిల్ విచారించిన సమయంలో నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చీఫ్ జస్టీస్ నేతృత్వంలోని ధర్మాసనం సీరియస్ అయింది.

Next Story