- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భారత పౌరుడు కాదు: తేల్చి చెప్పిన హైకోర్టు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయరంగ వ్యవహారాల మాజీ ప్రభుత్వ సలహాదారు చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయరంగ వ్యవహారాల మాజీ ప్రభుత్వ సలహాదారు చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh)కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గతంలో ఇచ్చిన తీర్పుపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు రమేశ్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడు అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. అందులో భాగంగా రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని చెన్నమనేని రమేశ్‌ను హైకోర్టు ఆదేశించింది.
రూ. 30 లక్షల్లో పిటిషనర్ ఆది శ్రీనివాస్ కు 25 లక్షల రూపాయలు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి 5 లక్షలు చెల్లించాలని గతంలోనే ఆదేశించారు. కోర్టు తీర్పు పైన అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకుని రూ. 30 లక్షలు చెన్నమనేని రమేశ్ చెల్లించారు. ఈ రోజు హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ సమక్షంలో ఆది శ్రీనివాస్ కు రూ.25 లక్షల DD ని చెన్నమనేని రమేశ్ తరపు న్యాయవాది అందజేశారు.






