- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం నేరం కాదు..హైకోర్టు సంచలన తీర్పు
పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పడం మోసం కావచ్చేమో కానీ నేరం కాదని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎవరైనా పెళ్లి చేసుంటానని మాట ఇచ్చి తరవాత పెళ్లి చేసుకోకపోతే ఎలాంటి చర్యలు ఉండవని తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పడం మోసం కావచ్చేమో కానీ నేరం కాదని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎవరైనా పెళ్లి చేసుంటానని మాట ఇచ్చి తరవాత పెళ్లి చేసుకోకపోతే ఎలాంటి చర్యలు ఉండవని తెలిపింది. కానీ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేటప్పుడే మోసం చేయాలనే ఉద్దేశం ఉంది అని తేలితే నేరమే అవుతుందని చెప్పింది. కానీ అది నిరూపించాల్సిన బాధ్యత బాధితులకే ఉంటుందని స్పష్టం చేసింది. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే దానిని నేరంగా పరిగణిస్తారని పేర్కొంది.
హైదరాబాద్ కర్నన్ ఘాట్కు చెందిన రాజాపురం జీవన్ రెడ్డి దాఖలు చేసిన పటిషన్ పై విచారణలో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2019లో కరకల్ల పద్మిని రెడ్డి అనే యువతి జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు రద్దు చేయాలని జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పును ఇచ్చింది. జీవన్ రెడ్డి తన పేరెంట్స్ ను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జీవన్ రెడ్డిపై పోలీసులు నేరపూరిత కేసు నమోదు చేయడంతో ఆ కేసును రద్దు చేయాలని తీర్పునిస్తూ విచారణ కోసం వాయిదా వేసింది.






