- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగాచీ ఘటనపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
పఠాన్ చెరువులోని పాశమైలారం పారిశ్రామికవాడాలో సంభవించిన సిగాచీ పరిశ్రమ పేలుడు(Sigachi Explosion)పై హైకోర్టు(High Court)లో నేడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది.

దిశ, వెబ్ డెస్క్ : పఠాన్ చెరువులోని పాశమైలారం పారిశ్రామికవాడాలో సంభవించిన సిగాచీ పరిశ్రమ పేలుడు(Sigachi Explosion)పై హైకోర్టు(High Court)లో నేడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు ఈ పిల్ దాఖలు చేసారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ పేలుడు జరిగిందని పిటిషనర్ ఆరోపిస్తూ.. ఇంతవరకు ప్రభుత్వం కంపెనీపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందించలేదని అన్నారు.
ప్రభుత్వాన్ని, సిగాచీ యజమాన్యాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కంపెనీ యాజమాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంటూ, మూడు వారాల గడువు విధించింది. అనంతరం ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.






