- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. కారణం ఇదే
భూదాన్ భూముల కేసు(Bhudan Land Case)లో ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : భూదాన్ భూముల కేసు(Bhudan Land Case)లో ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ.. మహేష్ అనే వ్యక్తి హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూములను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానం, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు వారి కుటుంబ సభ్యులను ప్రతివాదులుగా చేర్చారు.ఈ పిటిషన్ పై హైకోర్ట్ నేడు విచారణ చేపట్టగా.. భూదాన్ భూముల అక్రమాలపై ప్రభుత్వానికి, భూదాన్ బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసును సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ వివాదాస్పద భూమిపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదని తెలుపిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేసింది.






