కోర్టు ఆదేశాలు బేఖాతరు.. పెండింగ్ చలాన్ల పేరుతో మళ్లీ బండి సీజ్: హైకోర్టు సీరియస్

by Gantepaka Srikanth |

పెండింగ్ చలాన్లు ఉన్నాయనే నెపంతో వాహనాలను సీజ్ చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

కోర్టు ఆదేశాలు బేఖాతరు.. పెండింగ్ చలాన్ల పేరుతో మళ్లీ బండి సీజ్: హైకోర్టు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: పెండింగ్ చలాన్లు ఉన్నాయనే నెపంతో వాహనాలను సీజ్ చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ వాహనాలను జప్తు చేయడంపై ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. పెండింగ్ చలాన్లు ఉన్నంత మాత్రాన వాహనాలను సీజ్ చేయకూడదని గతంలోనే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఉత్తర్వులను ధిక్కరిస్తూ పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నారని పేర్కొంటూ ఒక బాధితుడు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తున్నారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముఖ్య అధికారులకు నోటీసులు..

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. హోం శాఖ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ (DGP), ట్రాఫిక్ అదనపు సీపీ, మరియు రవాణా శాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాహనాలను ఎందుకు సీజ్ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అధికారుల వివరణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కోర్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల (జూన్) 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

Next Story