- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంత మొబైల్స్‌తో చలాన్ వేస్తున్న పోలీసులు.. హోంశాఖకు హైకోర్టు నోటీసులు
సొంత మొబైల్స్‌తో చలాన్ వేస్తున్న పోలీసులు.. హోంశాఖకు హైకోర్టు నోటీసులు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల చలాన్‌ల(Traffic Challans)పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసిన విధానంపై హైకోర్టు సీరియస్ అయింది. మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి చలాన్ వేస్తున్నారని పిటిషనర్ రాఘవేంద్ర చారి పేర్కొన్నారు. పోలీసులు సొంత మొబైల్ ఫోన్ల ద్వారా తనకి మూడు చలాన్లు వేసినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో రాష్ట్ర హోంశాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి చలానాలు విధిస్తూ.. తరువాత అందులో రాయితీలు ఇవ్వడం.. చట్ట పరిణామాలపై ఉన్న భయాన్ని బలహీనపరచడమేనని రెండ్రోజుల క్రితం హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాయితీలు ఇవ్వడం ట్రాఫిక్ క్రమశిక్షణరాహిత్యాన్ని పెంచుతుందని పేర్కొంది. ఈ-చలానా వ్యవస్థలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పేర్కొంటూ.. చలానా జారీ అయ్యే వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని, ఆమేరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 9వ తేదీకి వాయిదా వేసింది.






