- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలను సకాలంలో ఎందుకు నిర్వహించట్లేదో కారణం తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 26 తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో దాఖలైన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ జాప్యంపై కారణాలు తెలపాలని ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
పంచాయతీ ఎన్నికలకు డెడ్ లైన్:
మరో వైపు మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు మొన్న ఆదేశించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడించాలని డెడ్ లైన్ సైతం విధించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టగా ఇంతలో మున్సిపల్ ఎన్నికల విషయంలో నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దీంతో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.






