- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : ఘంటా చక్రపాణి నియామకంపై సర్కార్ కు హైకోర్టు నోటీసులు
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ(Ambedkar Open University VC)గా ఘంటా చక్రపాణి Ghanta ChakrapaniనియామకంAppointment పై సర్కార్(State Government)కు హైకోర్టు నోటీసు(High Court Notices)లు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ(Ambedkar Open University VC)గా ఘంటా చక్రపాణి Ghanta ChakrapaniనియామకంAppointment పై సర్కార్(State Government)కు హైకోర్టు నోటీసు(High Court Notices)లు జారీ చేసింది. నిబంధనలకు విరుద్దంగా చక్రపాణిని వీసీగా నియమించారని హైకోర్టులో హనుమకొండకు చెందిన అసోసియేట్ రిటైర్డ్ ప్రొఫెసర్ కుమారస్వామి పిటిషన్ దాఖలు చేశారు. చక్రపాణి వయోపరిమితి ముగిసినా వీసీగా ఎలా నియమిస్తారని వీసీగా చక్రపాణికి అర్హతలు లేవని, జీవో 229 ను రద్దు చేయాలని కోరుతూ పిటిషనర్ వాదించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. వచ్చే నెల 11లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ కే లక్ష్మణ్ పిటిషన్ ను విచారించారు. వర్సిటీ వీసీగా డాక్టర్ ఘంటా చక్రపాణి నియామకంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి, యూజీసీతో పాటు వీసీ చక్రపాణిలను ఆదేశించింది. చక్రపాణిని గత డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా నియమించింది.






