- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: వీళ్లు ఎలా ఐఏఎస్ క్యాడర్ అవుతారు?.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
వీళ్లు ఎలా ఐఏఎస్ క్యాడర్ అవుతారు?.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు(Telangana High Court) నోటీసులు జారీ చేసింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని సోమవారం చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు, ఐఏఎస్ హోదా కల్పించిందని.. అది చట్టవిరుద్ధమని హైకోర్టులో వడ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు విచారించింది. శ్రీకాంత్ తరపున విజయ్ గోపాల్ అనే న్యాయవాది వాదించారు. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారో డిసెంబర్ 10వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ట్వీట్
Next Story






