High Court : బీఆర్ఎస్ నేతకు షాక్ ఇచ్చిన హైకోర్టు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ నేతకు హైకోర్ట్(High Court) షాక్ ఇచ్చింది.

High Court : బీఆర్ఎస్ నేతకు షాక్ ఇచ్చిన హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నేతకు హైకోర్ట్(High Court) షాక్ ఇచ్చింది. తనపై నమోదు చేసిన కేసులను క్వాష్(Quash Petition) చేయాలని బీఆర్ఎస్ కు చెందిన మన్నె క్రిశాంక్(Manne Krishank) దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్ట్ మంగళవారం విచారించింది. కంచ గచ్చిబౌలి భూముల అంశం(Kancha Gachibouli Land Issue)లో నకిలీ వీడియోలు వైరల్ చేశారని తనపై 4 తప్పుడు కేసులు నమోదు చేశారని, తాను ఎలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేయలేదని ఈ కేసులను కొట్టివేయాలని క్రిశాంక్ పిటిషన్లో పేర్కొన్నారు.

కాగా కంచ గచ్చిబౌలి భూములపై ఏఐ సహాయంతో ఫేక్ వీడియోలు(AI Fake Videos) ప్రచారం చేశారని, సీఎంపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణకు హాజరు కావాలని, పోలీసులకు సహకరించాలని ఆదేశించింది.అదే విధంగా కొణతం దిలీప్(Konatham Dilip) కు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Next Story