- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: బాలాపూర్‌లో జనవరి 24న నిర్వహించ తలపెట్టిన ధర్మరక్షణ సభకు హై కోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. ఈ సభను శాంతియుతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని హైకోర్టు సూచించింది. ఇందుకోసం తగిన బందోబస్తు కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది. జీహెచ్ఎంసి కూడా సరైన శానిటరీ వసతులు కల్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి చెందిన యువజన విభాగం గణేష్ సేన ఈ సభను నిర్వహిస్తోంది.
సభ అనుమతులకు సబంధించి పోలీస్ శాఖకు దరఖాస్తు చేసిన అనుమతుల మంజూరు పట్ల నిర్లక్ష్యం వహించడంతో హై కోర్టును ఆశ్రయించినట్లు అడ్వకేట్ కరుణ్ సాగర్ తెలిపారు. అక్రమ చొరబాట్లు, జనాభా మార్పులు, సామాజిక సవాళ్లు , జాతీయ భద్రత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ సభ లక్ష్యమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేర్కోంది. ఈ కార్యక్రమం జనవరి 24న మధ్యాహ్నం 2 గంటలకు రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ గణేష్ చౌక్ వద్ద జరగనుంది. ఈ సభకు 'జాగో భాగ్యనగర్ - ఛలో బాలాపూర్' అనే నినాదంతో హిందూ సమాజాన్ని పెద్ద ఎత్తున హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.






