- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు రూ.30 లక్షల ఫైన్.. హైకోర్టు సంచలన తీర్పు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడు అని తెలంగాణ హైకోర్టు తేల్చింది.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడు అని తెలంగాణ హైకోర్టు తేల్చింది. చెన్నమనేని పౌరసత్వంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తుది విచారణ జరిపిన కోర్టు తీర్పును వెల్లడించింది. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు ఆయనకు భారీగా జరిమానా విధించింది. వాటిని ఎవరెవరికి ఇవ్వాలో ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడగలరు.
తెలంగాణ మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్‌లో వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి సమీపంలోని కలెక్టరేట్‌లో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. కానీ, మంత్రుల హెలికాప్టర్‌ను పైలట్ అనూహ్యంగా సభా ప్రాంగణంలోనే దించేశాడు. ఈ పరిణామంతో సభకు హాజరైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు గాయపడ్డారు. ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలోనూ మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ల్యాండ్ అవుతుండగా మంటలు ఎగిసిపడి ప్రమాదం తప్పింది. తాజా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసుస్టేషన్‌లో వల్లభనేని వంశీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ఇవాళ విచారణకు రాగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఇవాళ వాటికన్ సిటీలో తుది శ్వాస విడిచారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ ఆకస్మిక మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. ఆయన నెలకొల్పిన రికార్డుల వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.






