- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. సిరిసిల్ల కలెక్టర్ డ్రెస్సింగ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. సీఎస్‌కు కీలక ఆదేశాలు
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: (Siricilla Collector) సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha)పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిడ్ మానేరు నిర్వాసితురాలు హై కోర్టును ఆశ్రయించిన క్రమంలో కలెక్టర్ తీరుపై తీవ్రంగా స్పందించింది. కలెక్టర్ కోర్టకు హజరైన తీరు చూస్తే మాకే భయంగా ఉందని, ప్రజలకు ఎలా సేవ చేస్తారని (Telangana High Court) హైకోర్టు మందలించింది. ఓ కలెక్టర్ కోర్టుకు వచ్చే తీరు ఇదేనా అంటూ ప్రశ్నించింది. ఈ మేరకు కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం తనకు నష్టపరిహారం చెల్లించాలని మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవిత హై కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపింది.
హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు పాటించకుండా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నష్టపరిహారం అందించలేదని హైకోర్టుకు కవిత (Kavita) వెల్లడించింది. ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెప్పి తనపై కలెక్టర్ అక్రమ కేసులు నమోదు చేయించారని అందువల్లనే మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది. విచారణ జరిపిన ధర్మాసనం కలెక్టర్‌పై చర్యలకు ఆదేశించింది. గతంలో బాధితురాలికి ఇచ్చిన నష్టపరిహారం తీర్పు యధావిధిగా అమలు చేయాలని ప్రభుత్వానికి, సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇదే పిటిషన్‌పై కోర్టుకు హాజరైనప్పుడు సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ సెన్స్‌పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా కలెక్టర్ తీరు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా కలెక్టర్ మారారు. ఇటీవల సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన విచారణలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హై కోర్టు వారెంట్ జారీ చేసింది. మిడ్ మానేరు నిర్వాసితుల నష్ట పరిహారం అంశంలో విచారణ జరిపిన కోర్టు కలెక్టర్ గైర్హజరు కావడంతో అసహనం వ్యక్తం చేసింది. మిడ్ మానేరు నిర్వాసితులు వేల్పుల ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని గత జూన్‌లో హై కోర్టు తీర్పు వెల్లడించింది. అక్టోబర్ 8న జరిగే విచారణ సమయంలో కలెక్టర్‌ను తమ ముందు హాజరు పర్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్టర్ కి ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సెప్టెంబర్ 17 ప్రభుత్వ పాలన దినోత్సవం సందర్భంగా చేపట్టిన కార్యక్రమానికి ఆయన అలస్యంగా హజరైయ్యారు. ప్రోటోకాల్ పాటించలేదని సీఎస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నోటీసులు జారీ చేశారు. వివాహ జీవితంలో కూడా వివాదస్పదంగా కలెక్టర్ తీరు ఉండటం గమనార్హం. అదనపు కట్నం కావాలని భార్యను వేధించినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి.






