- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : కేటీఆర్ పై కేసు కొట్టివేసిన హైకోర్ట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు హైకోర్టు(High Court)లో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు హైకోర్టు(High Court)లో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పరువు నష్టం కేసును న్యాయస్థానం కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన పరువుకు నష్టం కలిగించారని కేటీఆర్ పై నమోదైన కేసు తుది విచారణ నేడు ముగిసింది. మూసీ ప్రక్షాళనలో ప్రభుత్వం అంచనా వేసిన బడ్జెట్ రూ.1.5 లక్షల కోట్లు పెద్ద స్కామ్ అని, అందులో రూ.25 వేల కోట్లను రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టు ఉట్నూరులో కేసు నమోదైంది. అలాగే మేడిగడ్డలో పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగుర వేశారని మరో కేసు నమోదు కాగా.. ఈ ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవని, వెంటనే ఈ కేసులను కొట్టి వేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్(KTR Quash Petition) దాఖలు చేశారు కేటీఆర్.
ఈ పిటిషన్ ను విచారించిన కోర్ట్.. ఇరువైపులా వాదనల అనంతరం నేడు తుది తీర్పు వెలువరించింది. కేటీఆర్ పై నమోదైన కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేనందున కేసులను క్వాష్ చేస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ వర్గాలు ఆనందంలో మునిగిపోయాయి.






