- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court: డీజీపీ నియామక వివాదం: మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ
తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బి.శివధర్ రెడ్డి (Shivadhar Reddy) నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. అయితే, శివధర్ రెడ్డి నియామకం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని, దీనిని రద్దు చేసి తక్షణమే పూర్తిస్థాయి డీజీపీని నియమించేలా ఆదేశాలివ్వాలని ధనగోపాల్ రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) స్పందిస్తూ.. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోందని జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి (Vijaysen Reddy) ధర్మాసనానికి వివరించారు. ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఈ దశలో ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. ప్రస్తుతం తాత్కాలిక బాధ్యతలతో కొనసాగుతున్న డీజీపీ నియామక అంశంపై హైకోర్టు తదుపరి విచారణలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.






