- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vakiti Srihari: బీసీలు అధైర్యపడవద్దు.. హైకోర్టు నిర్ణయంపై మంత్రి వాకిటి శ్రీహరి
by Prasad Jukanti |
హైకోర్టు నిర్ణయంపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైకోర్టు తీర్పుపై నిరాశ చెందామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడవద్దని ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదన్నారు. జీవో నంబర్ 9, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించిన అనంతరం హైకోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన వాకిటి.. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించామని, కోర్టు నిర్ణయం బీసీల నోటివద్ద ముద్ద లాగేసినట్టు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు కాపీ చూశాక ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామన్నారు. న్యాయనిపుణుల సలహాలతోనే బిసీ బిల్లులు పాస్ చేశాన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కార్యచరణ తీసుకోబోతున్నామన్నారు.
Next Story






