హైకోర్టులో బండి భగీరథ్‌కు చుక్కెదురు !

by velandi.Saikiran |   (  Updated:2026-05-16 00:39:59  IST  )

POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమ‌ని తేల్చి చెప్పింది హైకోర్టు.

హైకోర్టులో బండి భగీరథ్‌కు చుక్కెదురు !
X

దిశ‌, వెబ్ డెస్క్: బండి భగీరథ్ కు హైకోర్టులో బిగ్ షాక్ త‌గిలింది. POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమ‌ని తేల్చి చెప్పింది హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని భగీరథ్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు, తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్రకారం, వ‌చ్చే గురువారం హై కోర్టు తీర్పు వెల్ల‌డించే ఛాన్స్ ఉంది.

Next Story