- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై హైకోర్టు స్టే.. విచారణ వాయిదా
తెలంగాణ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూముల వేలం కోసం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూమి వేలంపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూముల వేలం (Kancha Gachibowli land auction) కోసం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూమి వేలంపై సెంట్రల్ యూనివర్సిటీ (Central University) విద్యార్థులతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భూములను అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. దీనిపై విచారించిన తెలంగాణ హైకోర్టు (Telangana High Court).. విచారణను ఈ నెల 7 కు వాయిదా వేసింది. అలాగే ఈ భూముల అమ్మకం పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి తోడు ఇప్పటికే ఈ రోజు వరకు చెట్లను నరికి వేయవద్దని ఆదేశాలు ఇచ్చిన కోర్టు ఏప్రిల్ 7వ వరకు కంచ గచ్చిబౌలిలో ఉన్న చెట్లను తొలగించడం పై స్టే (Stop the removal of trees) విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ భూముల అమ్మకం వివాదం సుప్రీం కోర్టుకు చేరగా.. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న ప్రాంతానికి వెళ్ళి రిపోర్టు తయారు చేసి.. తమకు అందించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం చదును చేసేందుకు ప్రయత్నించిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.






