పహల్గామ్ దాడి: తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్.. ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ

by Ajay Maddhiboyina |

కశ్మీర్‌లోని పహల్గామ్ దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

పహల్గామ్ దాడి: తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్.. ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: కశ్మీర్‌లోని పహల్గామ్ దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్‌లో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. ఈ దాడికి గుణ‌పాఠం చెప్పేందుకు భార‌త్ సిద్ధ‌మౌతోంది. దీంతో స‌రిహ‌ద్దుల్లో యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. పాకిస్థాన్ సైతం క‌య్యానికి కాలు దువ్వుతోంది. కాబ‌ట్టి ఏ క్ష‌ణ‌మైనా యుద్ధం మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక పహ‌ల్గామ్ దాడి నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాలు సైతం అప్ర‌మ‌త్తం అయ్యాయ‌ని 14 ప్రాంతాల‌ను పోలీసులు హైఅల‌ర్ట్ జోన్లుగా పోలీసులు ప్ర‌క‌టించారని కొన్ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. ఇది త‌ప్పుడు వార్త అని కొట్టిపారేసింది. ఎలాంటి అల‌ర్ట్ పోలీసులు జారీ చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. పోలీసులు కేవ‌లం ముందు జాగ్ర‌త్త‌గా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో నిఘా పెంచార‌ని తెలిపింది. ఏదైనా భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌కు సంబంధిన ప్ర‌క‌ట‌న అయితే డీజీపీ ఆఫీసు నుండి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Next Story