- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్.. గాల్లో డేగలా డ్రోన్లు, నేలపై కదులుతున్న బలగాలు
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) సరిహద్దు అడవుల్లో మరోసారి తుపాకుల మోత, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట అడవుల్లో బలగాలు, మావోయిస్టుల మధ్య గెరిల్లా తరహా పోరు కొనసాగుతోంది.
బంకర్లు ధ్వంసం.. మందుపాతరలు నిర్వీర్యం
మావోయిస్టులు నిర్మించుకున్న రహస్య బంకర్లను కోబ్రా (CoBRA) దళాలు గుర్తించి తాజాగా నేలమట్టం చేశాయి. జెల్ల, తడపాల, డోలి అటవీ ప్రాంతాలను జోరుగా కూబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన పలు మందుపాతరలను (IEDs) బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ చాకచక్యంగా నిర్వీర్యం చేస్తున్నారు. కర్రెగుట్ట ప్రాంతంలో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తుండటంతో స్థానిక గిరిజన గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి.
కంటిమీద కునుకు లేకుండా..
అడవుల్లో అంగుళం అంగుళాన్ని భద్రతా దళాలు కంటిమీద కునుకు లేకుండా సోదా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు దాటి చొరబడకుండా అటు ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ఇటు తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు సమన్వయంతో జాయింట్ కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. మిగిలి ఉన్న అగ్రనేతలు కూడా చిక్కితే మావోయిస్టుల సాయుధ పోరాటానికి ఎండ్ కార్డు పడుతుందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఇక మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ జాడ కోసం కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇక జార్ఖండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన శరందా అటవీ ప్రాంతంలో మిసిర్ బేస్రా కోసం కోబ్రా దళాలు గాలిస్తున్నాయి.
- Tags
- Telangana-Chhattisgarh Border
- Maoist Combing Operation
- Karregutta Forest
- CoBRA Forces
- Maoist Bunkers Destroyed
- IEDs Defused
- Search for Damodar
- Misir Besra
- Saranda Forest Jharkhand
- Anti-Naxal Operations
- Greyhounds Police
- Naxalite Movement
- Breaking News Telangana
- Chhattisgarh Police
- Security Forces Hunt
- Jungle Warfare






