హైదరాబాద్‌లో హైఅలర్ట్.. నల్ల రిబ్బన్లతో ముస్లింల ప్రార్థనలు

by Kema Shiva Kumar |

పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం (Central Intelligence Agency) సూచన మేరకు హైదరాబాద్‌ (Hyderabad)లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

హైదరాబాద్‌లో హైఅలర్ట్.. నల్ల రిబ్బన్లతో ముస్లింల ప్రార్థనలు
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం (Central Intelligence Agency) సూచన మేరకు హైదరాబాద్‌ (Hyderabad)లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ.. ముస్లింలు అంతా నల్ల రిబ్బన్లు ధరించి ప్రార్థనలు చేయాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) గురువారం పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శాస్త్రిపురంలోని ఓ మసీదు వద్దకు వెళ్లి అందరికీ నల్ల రిబ్బన్లను పంపిణీ చేశారు. అక్కడి నుంచి మక్కా మసీదుకు వద్దకు చేరుకుని నల్ల రిబ్బన్లు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం పాకిస్థాన్‌ (Pakistan)కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అయితే, ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్‌ (Charminar), మక్కా మసీద్ (Mecca Masjid) పరిసర ప్రాంతాల్లో పోలీసుల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలను తాను కూడా సమర్థిస్తున్నట్లుగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు.

Next Story