- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ పేలుడు.. హైదరాబాద్‌లో కొనసాగుతున్న హై అలర్ట్
by Muthe.Rajitha |
ఢిల్లీ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే పేలుడు ఘటన అనంతరం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించగా... అన్ని ముఖ్య నగరాల్లో హై అలర్ట్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. అయితే దేశంలో ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా, ఉగ్రకుట్రలు భగ్నమైనా వాటి మూలాలు హైదరాబాద్‌లో బయటపడటం కలవరం సృష్టిస్తోంది.
ఈ పేలుళ్ల ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో రాజేంద్రనగర్‌కు చెందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ కూడా ఉండటం సంచలనం రేపుతోంది. నగరంలోని కీలక ప్రాంతాలతోపాటు ఓల్డ్ సిటిలోనూ ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.
Next Story






