సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హీరో సల్మాన్‌ఖాన్.. సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-31 03:04:47  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం సాయంత్రం ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే.

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హీరో సల్మాన్‌ఖాన్.. సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం సాయంత్రం ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలి పెళ్లి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు ముచ్చటించారు. ఈ వివాహ వేడుకకు హీరో సంజయ్ దత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ సీఎం అశోక్ చవాన్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, పారిశ్రామికవేత్త ముకేశ్, నీతా అంబానీ, మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు. అయితే, సల్మాన్ ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story