రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రచ్చ: మత్తులో బైకును ఢీకొట్టి వాగ్వాదం

by Vemula.Srinu Prasad |

హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. మద్యం మత్తులో కారు నడుపుతూ బైకును బలంగా ఢీకొట్టారు...

రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రచ్చ: మత్తులో బైకును ఢీకొట్టి వాగ్వాదం
X

దిశ, వెబ్ డెస్క్: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. మద్యం మత్తులో కారు నడుపుతూ బైకును బలంగా ఢీకొట్టారు. అంతేకాదు కారు ఆపకుండా వెళ్ళిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారితో లావణ్య వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. పాజిటివ్ అని వచ్చింది. దీంతో పోలీసులతో కూడా వాదనకు దిగారు. ప్రమాద సమయంలో కారులో ఆమెతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. అలాగే మద్యం బాటిళ్లు సైతం ఉన్నాయని గ్రామస్థులు ఆరోపించారు. ప్రస్తుతం లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేశారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు కొంతకాలంగా వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న లావణ్య ఇప్పుడు ఈ ఘటనతో మారోసారి వార్తల్లో నిలిచారు.

vedio

Next Story