Nagarjuna: సీఎం రేవంత్‌ని కలిసిన హీరో నాగార్జున దంపతులు..

by Ramesh Naini |   (  Updated:2025-05-31 07:25:08  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీనటుడు నాగార్జున దంపతులు కలిశారు.

Nagarjuna: సీఎం రేవంత్‌ని కలిసిన హీరో నాగార్జున దంపతులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని సినీనటుడు నాగార్జున (Nagarjuna) దంపతులు కలిశారు. ఇవాళ (శనివారం) ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన నాగ్ దంపతులు కుమారుడు అఖిల్ వివాహా వేడుకకు హాజరుకావాలని పెళ్లి పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.

నాగార్జున చిన్న కొడుకు (Akhil) అఖిల్, (Zainab) జైనబ్‌ల పెళ్లి జూన్ 6న జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వారి పెద్ద కుమారుడు (Naga Chaitanya) నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) వేదికగానే జరగనుందని సమాచారం. కాగా, గత కొంత కాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అనుమతితో గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత ఈ జంట పలుమార్లు నగరంలో సందడి చేశారు.

Next Story