- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Old City: పాతబస్తీలో.. మిస్ వరల్డ్ ప్రతినిధుల హెరిటేజ్ వాక్.. ఎప్పుడంటే?
హైదరాబాద్‌లో నిర్వహించే మిస్ వరల్డ్ (Miss World) ఈవెంట్ తో చార్మినార్, లాడ్ బజార్ లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో నిర్వహించే మిస్ వరల్డ్ (Miss World) ఈవెంట్ తో చార్మినార్, లాడ్ బజార్ లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది. మిస్ వరల్డ్ ఈవెంట్‌లో భాగంగా ఈ నెల13 న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చార్మినార్, లాడ్ బజార్‌లలో హైదరాబాద్‌తో పాటు (Charminar) చార్మినార్, లాడ్ బజార్ (Lad Bazaar) సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ (Heritage Walk) నిర్వహించనున్నారు. లాడ్ బజార్‌లో మిస్‌వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో మాట్లాడనున్నారు. 120 దేశాల మిస్‌వరల్డ్ ప్రతినిధులు హాజరయ్యే.. ఈ హెరిటేజ్ వాక్‌ను 150 కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ ఈవెంట్‌ను తిలకిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను తెలంగాణకు ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. చారిత్రక చార్మినార్ కట్టడం, లాడ్‌బజార్ ప్రత్యేకతలను మిస్ వరల్డ్ ప్రతినిధులు వివరించి వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్‌గా ప్రమోట్ చేయనున్నారు.
లాడ్ బజార్ ప్రత్యేకత
నిజాం పాలనలో వెలసిన లాడ్ బజార్‌కు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. బాంగిల్స్ రాజధానిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. రంగురంగుల పేర్లు, మణులు, జరీ పనితో కూడిన సాంప్రదాయిక గాజులు ఇక్కడి ప్రత్యేకత. ప్రతి పెళ్లి సీజన్లో ఇది జనాల ఆకర్షణ కేంద్రం ఉంటుంది. ఇక్కడ నాణ్యమైన ముత్యాలు, నగలు సరసమైన ధరల్లో లభిస్తాయి. హస్తకళల హబ్‌గా కూడా పేరుంది. చిత్రకళ, నకాశీ పని, ఇస్లామిక్ ఆర్ట్ వంటి సాంప్రదాయిక హస్త శిల్ప వస్తువులు ఇక్కడ లభిస్తాయి. ఇత్తార్ (సువాసనలు), ఖురాన్ ప్రతులు, సాంస్కృతిక వస్తువులతో ఇది ఇస్లామిక్ ఆర్ట్‌కి ప్రతీకగా నిలిచింది. ఓల్డ్ సిటీ ఇటుకల రోడ్లు, సజీవమైన దుకాణాలు, సాంస్కృతిక సువాసనలు ప్రతి ఒక్కరినీ ముగ్ధులను చేస్తాయి.
చార్మినార్ ప్రత్యేకత
1591లో కుతుబ్ షాహీ రాజు ముహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన చార్మినార్, హైదరాబాద్ సాంస్కృతిక గర్వాన్ని ప్రతిబింబిస్తోంది. నాలుగు మినార్లతో కూడిన ఈ స్మారకం ఇండో-ఇస్లామిక్ డిజైన్‌కు నిదర్శనం. ప్లేగు నివారణ తర్వాత నగర స్థాపనకు గుర్తుగా నిర్మించబడింది. 56 మీటర్ల ఎత్తు, 45 మీటర్ల వెడల్పుతో ఇది హైదరాబాద్ కు "హార్ట్" గా ఉంది. మినార్లపై నుంచి పాత నగరం, మక్కా మసీదు అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు కోసం ప్రతిపాదించబడింది. ఇది నిజాం కాలం నుంచి నేటి వరకు హైదరాబాద్ ఐకాన్‌గా ఉంది.






