IAS, IPS, IFS: చార్మినార్ నుండి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్

by Gantepaka Srikanth |

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 159 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ ట్రైనీ అధికారులకు వారసత్వ కట్టడాల గురించి, చారిత్రక అనుభూతి

IAS, IPS, IFS: చార్మినార్ నుండి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 159 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ ట్రైనీ అధికారులకు వారసత్వ కట్టడాల గురించి, చారిత్రక అనుభూతిని అందించే ఉద్దేశ్యంతో పర్యాటక శాఖ, డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్, పోలీసు శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), చౌమహల్లా ప్యాలెస్ డైరెక్టర్ సంయుక్తంగా 'హెరిటేజ్ వాక్'ను నిర్వహించారు. చార్మినార్ వద్ద మొదలైన ఈ నడక చారిత్రక లాడ్ బజార్ మీదుగా చౌమహల్లా ప్యాలెస్ వరకు కొనసాగింది. నగర చరిత్ర, సంస్కృతి, నిర్మాణ వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. శిక్షణలో ఉన్న యువ అధికారులకు హైదరాబాద్ నగర ఘనమైన వారసత్వాన్ని, నిజాంల కాలం నాటి వైభవాన్ని పరిచయం చేయడంలో ఈ హెరిటేజ్ వాక్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ట్రైనీ అధికారులు చారిత్రక భవనాలు, స్థలాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. వారికి అవసరమైన సమాచారాన్ని అధికారులు అందించారు. శాంతిభద్రతలు, నిర్వహణ విషయంలో పోలీసు శాఖ పూర్తి సహకారం అందించగా, ఏఎస్ఐ పురావస్తు అంశాలపై అవగాహన కల్పించింది. చౌమహల్లా ప్యాలెస్ డైరెక్టర్ ఈ ప్యాలెస్ చరిత్ర మరియు విశేషాలను తెలియజేశారు.

Next Story