- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె జీవితం అందరికీ స్పూర్తిదాయకం.. దాది జీ మృతి పట్ల సీఎం రేవంత్ విచారం
ఆమె జీవితం అందరికీ స్పూర్తిదాయకమని దాది రతన్ మోహినీ జీ (Dadi Rathan Mohini ji) ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆమె జీవితం అందరికీ స్పూర్తిదాయకమని దాది రతన్ మోహినీ జీ (Dadi Rathan Mohini ji) ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల (Bramha Kumarees Global Centers)లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి చెందారు. ఆమె మృతి పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన రేవంత్.. విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో.. బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా విశిష్ట సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.
అలాగే ఆదర్శవంతమైన దాది జీ జీవితం ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడారు. వారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా, మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక దాది జీ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో విస్తరింపజేసి, సమాజానికి శాంతి, మానవతా విలువల సందేశాన్ని అందించారని గుర్తుచేసుకున్నారు. దాది జీ మృతి రాష్ట్రానికి, దేశానికి, ఆధ్యాత్మిక విశ్వానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. దాది రతన్ మోహినీ జీ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ఆకాంక్షించారు.






