- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రచ్చకెక్కిన కోడి పంచాయతీ.. పోలీస్ స్టేషన్ దాకా రచ్చ..!
వృద్ధ మహిళ పెంచుకున్న కోడి కారణంగా గ్రామంలో పెద్ద రచ్చ జరిగింది. చివరకు ఈ కోడి గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది.!

దిశ, నకిరేకల్ టౌన్: వృద్ధ మహిళ పెంచుకున్న కోడి కారణంగా గ్రామంలో పెద్ద రచ్చ జరిగింది. చివరకు ఈ కోడి గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది.! విచిత్రంగా ఉన్నా.. ఇది నిజమే. నకిరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలు తన ఇంట్లో కోడి పెంచుకుంటోంది. ప్రతిరోజూ ఆ కోడి బయటకు తిరిగి, సాయంత్రం ఇంటికి చేరేది. అయితే పక్కింటి రాకేష్ ఇంటి వద్ద గడ్డివాములో గింజలు తింటుందన్న కారణంతో, కోడిని కర్రతో కొట్టాడట.
ఈ ఘటనలో కోడి కాళ్లు విరగడంతో, గంగమ్మ బోరున విలపిస్తూ నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాకేష్‌పై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేసింది. “నా కోడిని నా కళ్లముందే కొట్టాడు. నాకు డబ్బులు వద్దు... రాకేష్‌కు శిక్ష పడాలి” అని ఆమె డిమాండ్ చేసింది.
పోలీసులు మాత్రం షాక్ అయ్యారు. “ఇది కోడి గొడవే కదా… ఎంత కేసులొస్తే?” అంటూ తలలు పట్టుకున్నారు. గంగమ్మను సమర్థంగా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. చివరికి గ్రామానికి వచ్చి సమస్యను పంచాయతీగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఆమెను ఇంటికి పంపించారు. కోడికి చికిత్స చేయించుకోవాలంటూ సూచించారు. ఇక ఈ "కోడి కేసు"ను ఎలా పరిష్కరించాలో తెలియక నకిరేకల్ పోలీసులు చింతిస్తున్నారు..!






