- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Helpline: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్ (Israel)-ఇరాన్ (Iran) మధ్య యుద్ధ వాతావరణం రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో (Telangana Bhavan) ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఈ ఇరు దేశాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఈ ప్రత్యేక హెల్ప్ లైన్ ప్రారంభించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇరు దేశాల భారత రాయబార కార్యాలయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు తెలంగాణకు చెందిన ఎవరూ ఈ ఉద్రిక్తతల కారణంగా ప్రభావితం అయినట్లు సమచారం అందలేదు. అయినప్పటికీ భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలతో తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణం సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సహాయం కోసం +91 9871999044 (వందన,పి.ఎస్, రెసిడెంట్ కమిషనర్), +91 9643723157 (జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్), +91 9910014749 (జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్), +91 9949351270 (సిహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి) నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.






