వరద బాధితులకు సహాయం అందించాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

by Geesa Chandu |

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, సర్కారు బుద్దితెచ్చుకుని వరద బాధితులకు సహాయం అందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.

వరద బాధితులకు సహాయం అందించాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, సర్కారు బుద్దితెచ్చుకుని వరద బాధితులకు సహాయం అందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ నేతల వాహనాలపై కాంగ్రెస్ గూండాల దాడి గర్హనీయం అన్నారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండా సీఎం గాలికి వదిలేసి ఖమ్మం వెళ్లాడని మండిపడ్డారు. పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ప్రజలు తిరగబడడంతో రేవంత్ రెడ్డి అధికారులు, సెక్యూరిటీ మీద బూతులు లంగించుకోవడం సిగ్గు చేటన్నారు. ప్రజలకు సాయం చేయకుండా సమాధానం చెప్పలేని ప్రభుత్వం ప్రతిపక్షం మీద దాడులకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిందన్న సోయి కాంగ్రెస్ సర్కారుకు లేదన్నారు. అన్ని విషయాల్లో కేసీఆర్ పై ప్రభుత్వం మీద నిందలు మోపుతుందని ఆరోపించారు.

Next Story